కోరిక తీర్చ లేదని కూతురిని చంపిన కన్నతండ్రి.. మృతదేహంపై అత్యాచారం

Man kills 14-year-old daughter, sexual assault her corpse in Madhya Pradesh. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. గుణ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక వికలాంగుడు

By అంజి  Published on  24 Feb 2022 3:58 PM IST
కోరిక తీర్చ లేదని కూతురిని చంపిన కన్నతండ్రి.. మృతదేహంపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. గుణ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక వికలాంగుడు తన 14 ఏళ్ల కుమార్తెను చంపి, ఆమె మృతదేహంపై అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపై కన్నతండ్రే కన్నేశాడు. ఆమెపై తన లైంగిక వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఇందు కోసం బాలికను తండ్రి బలవంతం చేశాడు. అయితే బాలికను ఎలాగోలా ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన తండ్రి.. లొంగదీసుకోవాలనుకున్నాడు. బాలిక ఒప్పుకోపోగా, అందరికి చెప్తానని బెదిరించింది. దీంతో బాలికను చంపి తండ్రి.. బాలిక మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బజరంగ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైతా డోంగర్ గ్రామంలో నివసించే 40 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ రాజీవ్ కుమార్ మిశ్రా తెలిపారు. తన మైనర్ కుమార్తె ఇంటి నుంచి కనిపించకుండా పోయిందని నిందితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విచారణలో.. నిందితుడి పొరుగువారు మంగళవారం మధ్యాహ్నం బాధితురాలు తన తండ్రితో చివరిసారిగా కనిపించిందని పోలీసులకు సమాచారం అందించారని అధికారి తెలిపారు.

నిందితుడు తన కుమార్తెపై అత్యాచారం చేయాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో దామ్‌డోలి అడవికి తీసుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. అయితే, ఇతర కుటుంబ సభ్యులకు ఈ విషయం చెబుతానని బాలిక బెదిరించడంతో, నిందితుడు ఆమెను గొంతు కోసి, ఆపై శవంపై అత్యాచారానికి పాల్పడ్డారని అధికారి తెలిపారు. నిందితుడు అందించిన సమాచారం మేరకు.. పోలీసు బృందాన్ని అడవికి పంపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలు కూడా సేకరించామని మిశ్రా తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద హత్య, అత్యాచారం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Next Story