తాగిన వ్య‌క్తిని చెరువులోకి దూకి ఈత కొట్ట‌మ‌న్నారు.. చివ‌రికి విషాదం..

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలోని బండ్లగూడకు చెందిన రోజు కూలీ మద్యం మత్తులో నీటిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు

By M.S.R  Published on  24 May 2024 12:30 AM GMT
తాగిన వ్య‌క్తిని చెరువులోకి దూకి ఈత కొట్ట‌మ‌న్నారు.. చివ‌రికి విషాదం..

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలోని బండ్లగూడకు చెందిన రోజు కూలీ మద్యం మత్తులో నీటిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని కలబురగి జిల్లా కమల్‌పూర్ తహసీల్ వద్ద చెరువులో మునిగి చనిపోయాడు. సాజిద్ ముగ్గురు స్నేహితులతో కలబుర్గి జిల్లాకు వెళ్లి కమలాపూర్ తహసీల్ వద్ద ఉన్న చెరువును సందర్శించారు. అక్కడ వారందరూ మద్యం సేవించారు. మద్యం సేవించిన అతని ఇద్దరు స్నేహితులు ఈత కొట్టేందుకు చెరువులోకి దిగగా, ఇద్దరు బయట నిలబడి వారిని చూస్తున్నారు. బయట ఉన్న సాజిద్‌ను అతని స్నేహితుల్లో ఒకరు సరస్సులో దూకి ఈత కొట్టమని అడిగాడు. కొన్ని మాటలతో సాజిద్ ను రెచ్చగొట్టారు.

ఈత రాకపోయినా సాజిద్ ఒక్కసారిగా చెరువులోకి దూకి మునిగిపోవడం మొదలుపెట్టాడు. అతని స్నేహితుల్లో ఒకరు సాజిద్ కు ఈత రాదని రక్షించమని కోరారు. చెరువులో ఉన్న ఇద్దరూ అతన్ని రక్షించలేకపోయారు. సాజిద్ ఒడ్డుకు చేరుకోడానికి ఇబ్బంది పడుతుండగా.. కొందరు వ్యక్తులు నీటిలోకి దూకి అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే సాజిద్ నీటిలో మునిగి చనిపోయాడు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని నీటిలో నుంచి వెలికితీసి బంధువులకు అప్పగించారు. కలబురగి పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story