ఇంట్లో అంద‌రూ పడుకున్నాక కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డ తండ్రి

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  6 March 2025 7:00 PM IST
ఇంట్లో అంద‌రూ పడుకున్నాక కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డ తండ్రి

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత 14 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి. తండ్రి అనే పదానికే కళంకం తీసుకుని వచ్చిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని డియోని తహసీల్‌లో ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. రాత్రి సమయంలో ఆ బాలిక దగ్గరకు వెళ్లిన తండ్రి ఈ దారుణానికి తెగబడ్డాడు.

"కుటుంబ సభ్యులందరూ నిద్రపోయిన తర్వాత, ఆ వ్యక్తి తన కూతురిపై ఇంట్లోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో అతని బారి నుండి విడిపించడానికి బాలిక తల్లి ప్రయత్నించింది, కానీ అతను ఆమెను కొట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు" అని పోలీసులు తెలిపారు.

బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి, తరువాత అతన్ని అరెస్టు చేశారు. స్థానిక కోర్టు అతన్ని మార్చి 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

Next Story