హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేయడంతో గోవాలోని తిస్వాడికి చెందిన 22 ఏళ్ల యువకుడిని అత్యాచారం కేసులో అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం, జూలై- డిసెంబర్ 14 మధ్య నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి తెగబడ్డాడని నిందితురాలు వాపోయింది. ఆమెను చంపేస్తానని బెదిరించడమే కాకుండా దుర్భాషలాడారు. తనపై జరిగిన వేధింపులను తన తల్లిదండ్రులకు ఆమె చెప్పలేకపోయింది.
అతడి వేధింపులకు ఫుల్ స్టాప్ పడకపోవడంతో చివరికి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసులను ఆశ్రయించారు. అధికారులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.