Telangana: 8 ఏళ్ల కుమార్తెకు విషమిచ్చి చంపిన వ్యక్తి అరెస్ట్

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిలా గ్రామంలో దారుణం వెలుగు చూసింది. తన ఎనిమిదేళ్ల కుమార్తెకు విషమిచ్చి హత్య చేసిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By అంజి  Published on  16 Aug 2024 10:13 AM IST
Medak , Crime, Telangana

Telangana: 8 ఏళ్ల కుమార్తెకు విషమిచ్చి చంపిన వ్యక్తి అరెస్ట్

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిలా గ్రామంలో దారుణం వెలుగు చూసింది. తన ఎనిమిదేళ్ల కుమార్తెకు విషమిచ్చి హత్య చేసిన తండ్రిని ఆగస్టు 14వ తేదీ బుధవారంనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి.. తన కుమార్తెను భారంగా చూశాడు. ఆమె చదువుకు, భవిష్యత్తుకు, వివాహానికి, పెరిగే కొద్ది ఖర్చులు భరించాల్సి వస్తుందని కడతేర్చాడు. నిందితుడిని ఇక్కిరి శ్రీశైలంగా పోలీసులు గుర్తించారు.

నివేదికల ప్రకారం.. ఈ ఏడాది మే 31వ తేదీన నిందితుడు తన కుమార్తెకు ఎలుకల మందును కూల్‌డ్రింక్‌లో కలిపి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెకు తాగించాడు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి ఆమెను హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. జూన్‌ 3న అక్కడ బాలిక చికిత్స పొందుతూ మరణించింది.

ఆమె మరణం తర్వాత తండ్రి భావోద్వేగానికి లోనవడంతో కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె మృతికి కారణాలు తల్లి సౌందర్య ఆరా తీశారు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి శ్రీశైలం తప్పించుకుని తిరుగుతున్నాడు. బుధవారం చేగుంట వైపు నుంచి శ్రీశైలం ద్విచక్ర వాహనంపై వెల్దుర్తికి వస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు వెల్దుర్తి శివారులో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story