అర్థరాత్రి వేళ కుమార్తెకు వేధింపులు.. తండ్రి ఏం చేశాడంటే..
Man Held for killing a youth for harassing his daughter in Karnataka. తన కూతురిని వేధించినందుకు యువకుడిని చంపాడనే ఆరోపణలపై కర్ణాటక
By Medi Samrat Published on 6 Dec 2021 4:57 PM IST
తన కూతురిని వేధించినందుకు యువకుడిని చంపాడనే ఆరోపణలపై కర్ణాటక పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వి.వి. పురం పోలీసులు, నిందితుడిని బెంగళూరులోని కళాసిపాళ్యం సమీపంలోని వినోబా నగర్‌కు చెందిన వి.నారాయణ (39)గా గుర్తించారు. మరణించిన యువకుడిని తమిళనాడుకు చెందిన నివేష్ కుమార్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 19 ఏళ్ల నివేష్ కుమార్ ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చాడు. వినోబానగర్‌లోని తన మేనమామ వద్ద ఉంటున్నాడు. తన నివాసంలో నవంబర్ 27న రాత్రి 11.30 గంటల సమయంలో నివేష్ తన కూతురితో గొడవ పడుతుండడం నిందితుడు నారాయణ చూశాడు. కోపోద్రిక్తుడైన నారాయణ కర్రతో అతడిపై దాడి చేశాడు. ఆ తర్వాత నివేష్ తన ఇంటి దగ్గర గాయాలతో ఉన్నాడని గుర్తించిన తర్వాత.. నిందితుడే అతన్ని ఆటోరిక్షాలో విక్టోరియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నిందితుడిని ఆస్పత్రికి తరలించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో ఉన్న నివేష్ నవంబర్ 28 ఉదయం గాయాలతో మరణించాడు. అతడు ఎవరనే విషయం తెలియకపోవడంతో.. ఆసుపత్రి అధికారులు పోలీసులను సంప్రదించారు. అప్పటికే నివేష్ మామ మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు అతడిని పిలిపించి మృతదేహాన్ని గుర్తించారు. నారాయణ కుమార్తెతో నివేష్ ప్రేమలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు నారాయణను విచారించగా నేరం అంగీకరించాడు. పోలీసులు నిందితుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నారు. ఆ యువకుడు అర్థరాత్రి అమ్మాయి ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.