పెళ్లి విషయమై గొడవ.. కొడుకును నరికి చంపిన తండ్రి

Man hacks son to death over his rush to get married in Tamil Nadu . తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్లక్కురిచి జిల్లాలో ఓ వ్యక్తి పెళ్లి విషయమై గొడవపడి కొడుకును నరికి చంపాడు.

By అంజి  Published on  18 Dec 2021 10:18 AM IST
పెళ్లి విషయమై గొడవ.. కొడుకును నరికి చంపిన తండ్రి

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్లక్కురిచి జిల్లాలో ఓ వ్యక్తి పెళ్లి విషయమై గొడవపడి కొడుకును నరికి చంపాడు. కేశవన్ (65), అతని కుమారుడు శివమణి (30) మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. కేశవన్, అతని భార్య పళనియమ్మాళ్(60) రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు శివగామి, సోనియా. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. అయితే కొడుకు శివమణి (30) పెళ్లి చేసుకోవాలనే కోరికపై కేశవన్, శివమణి గొడవ పడ్డారు. అంతకుముందు శివమణి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న మూడేళ్ల కాలంలో కుటుంబ పోషణ కోసం పంపిన డబ్బు విషయంలో.. తల్లిదండ్రులతో పలుమార్లు వాగ్వాదాలు, గొడవలు కూడా జరిగినట్లు సమాచారం.

అయితే గతేడాది నుంచి శివమణి తమిళనాడులోనే ఉంటున్నారు. నిన్న రాత్రి తండ్రీకొడుకుల మధ్య పెళ్లి విషయమై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని, చివర్లో కోపోద్రిక్తుడైన కేశవన్ కొడుకును గొడ్డలితో నరికి చంపాడు. ఘటన జరిగిన వెంటనే కేశవన్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంతలో ఇరుగుపొరుగు వారు ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న శివమణిని ఉలుందూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. స్థానిక పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉంచారు. పరారీలో ఉన్న కేశవన్‌ని పట్టుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story