దారుణం.. చెప్పులతో కొట్టిన భార్య.. భర్తను నరికి చంపిన దుండగులు

Man hacked to death to take revenge, after wife beats her harassers with sandals. ఓ వ్యక్తిని నరికి చంపిన ఘటన బెంగళూరులో కలకలం రేపుతోంది. మృతుడు యలహంక సమీపంలోని కొండప్ప లేఅవుట్‌లో

By అంజి  Published on  23 Oct 2022 3:50 PM IST
దారుణం.. చెప్పులతో కొట్టిన భార్య.. భర్తను నరికి చంపిన దుండగులు

ఓ వ్యక్తిని నరికి చంపిన ఘటన బెంగళూరులో కలకలం రేపుతోంది. మృతుడు యలహంక సమీపంలోని కొండప్ప లేఅవుట్‌లో నివాసం ఉంటున్న 33 ఏళ్ల చంద్రశేఖర్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చంద్రశేఖర్‌ ఇంటి టెర్రస్‌పై నిలబడి ఉండగా దుండగులు అతన్ని నరికి చంపారు. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి జరిగింది. ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్ జిల్లా పెడిహట్టి గ్రామానికి చెందినవాడు. మూడున్నరేళ్ల క్రితం శ్వేతతో వివాహమై ఆరు నెలల క్రితం బెంగళూరు వచ్చాడు. శ్వేత ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్‌లో ఉన్న సమయంలో ఒక వర్గం వారు వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విషయంలో కొందరు పెద్దలు జోక్యం చేసుకోవడంతో పోలీసుల సమక్షంలోనే ఆ వర్గం, శ్వేత మధ్య సమస్యను పరిష్కరించారు. ఈ క్రమంలోనే దుండగులను పోలీసులు చెప్పులతో కొట్టాలని శ్వేతను కోరారు. ఈ ఘటన తర్వాత దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయి బెంగళూరులో స్థిరపడ్డారు. ఇప్పుడు గతంలో జరిగిన ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకే దుండగులు ఆమె భర్తను నరికి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.

Next Story