మైనర్ బాలికను వేధించి హత్య చేసిన వ్యక్తి.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

Man gets lifer for harassing, killing minor girl. 2017లో యాదగిరిగుట్టలో ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించి హత్య చేసిన వ్యక్తి

By Medi Samrat
Published on : 29 Aug 2022 8:20 PM IST

మైనర్ బాలికను వేధించి హత్య చేసిన వ్యక్తి.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

2017లో యాదగిరిగుట్టలో ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించి హత్య చేసిన వ్యక్తికి స్థానిక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడైన‌ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా యాదగిరిగుట్ట యాదగిరిపల్లికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి జి.శ్రీకాంత్ (26)కు శిక్ష పడింది.

17 ఏళ్ల మైన‌ర్ బాలిక‌ను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్న శ్రీకాంత్ 2017 జూన్‌లో ఆమె ఇంట్లోకి చొరబడి పలుమార్లు కత్తితో పొడిచాడు. బాలిక‌ను రక్షించేందుకు వచ్చిన ఆమె అన్నయ్యపై కూడా దాడి చేశాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్.. ఈ కేసులో దర్యాప్తు అధికారి బృందం చేసిన కృషిని అభినందించారు.


Next Story