నవంబర్ 2022లో నారాయణగూడలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో నాంపల్లిలోని II అదనపు సెషన్స్ జడ్జి వినోద్ కుమార్, రాగుల సాయి అలియాస్ నాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడు ఎ రాహుల్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరిస్తూ, రాగుల సాయికి ఉరిశిక్ష విధిస్తూ, రాహుల్‌కు 1,000 జరిమానా కూడా విధిస్తూ తీర్పు చెప్పారు.
2022లో రాగుల సాయి అనే వ్యక్తి తన మాజీ భార్య ఆర్తికి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో రాగుల సాయి (27) స్నేహితుడైన నాగరాజును ఆర్తి రెండో వివాహం చేసుకుంది. నాగరాజు పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్తిని పలుమార్లు వేధింపులకు గురిచేశారు. నాగరాజు రాగుల సాయి ని ఆర్తిని చెల్లిగా పిలవాలని తెలపడంతో కక్ష పెంచుకున్న రాగుల సాయి అతని స్నేహితుడు రాహుల్(26) ఇద్దరు కలిసి గర్భంతో ఉన్న ఆర్తిని, నాగరాజు, సంవత్సరం కొడుకు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
చికిత్స పొందుతూ ముగ్గురూ మరణించగా, ఆర్తి తుది శ్వాస విడిచేలోపు చనిపోయిన మగబిడ్డకు జన్మనిచ్చింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందడంతో అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. నారాయణగూడ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి చార్జ్ ఫైల్ చేశారు. విచారణలో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కీలకంగా మారాయని పోలీసులు తెలిపారు.