హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 43 ఏళ్ల ఆటో డ్రైవర్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది. నిందితుడు బాలాపూర్‌లోని షాహీన్ నగర్‌లో నివసిస్తున్న సయ్యద్ హాజీ అలీ కాగా.. IPC సెక్షన్లు 420, 363, 376 మరియు POCSO చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద దోషిగా నిర్ధారించింది న్యాయస్థానం. ఈ ఘటన 2021 లో జరిగింది. ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్న బాధితురాలి తండ్రి తన కుమార్తెను కొన్ని రోజులు అలీని చూసుకోమని అప్పగించాడు. దీంతో నిందితుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫిర్యాదు ఆధారంగా రంగారెడ్డి జిల్లాలోని పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం అందించగా.. నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. రూ.15,00 జరిమానా కూడా విధించింది.