Hyderabad: మైలార్ దేవుపల్లిలో మైనర్ దారుణ హత్య
మైలార్‌దేవ్‌పల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు.
By అంజి Published on 27 Aug 2023 1:30 PM ISTHyderabad: మైలార్ దేవుపల్లిలో మైనర్ దారుణ హత్య
హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హతయ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ నగరంలో నడిరోడ్డు పై, నిర్మానుష్య ప్రాంతాల్లో హత్యలు జరుగుతూ ఉండడంతో స్థానిక జనం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికి పోతున్నారు. బీహార్‌కు చెందిన పాశ్వాన్ (17) తన కుటుంబంతో కలిసి మైలార్‌దేవ్‌పల్లిలో ఉంటూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం కర్మాగారంలో కూలీ డబ్బులు తీసుకుని బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. అతడి కోసం వెతికిన కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు.
ఇంతలో లక్ష్మీగూడ కాలనీకి చెందిన స్థానికులు నిర్మానుష్య ప్రాంతంలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి పిలిపించిన పాశ్వాన్ తండ్రి అది తన కుమారుడేనని గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. బాధితుడు 3 నెలల క్రితమే నగరానికి వలస వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే గత 2 రోజుల క్రితం బీహార్‌కు చెందిన వారితో రాజా పాశ్వాన్ గొడవ పడ్డాడు. వారే హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.