వృద్ధ ప్రయాణీకుడిలా జుట్టుకు, గడ్డానికి రంగులు వేసుకుని వెళ్లాడు.. తీరా!!

సీనియర్ సిటిజన్‌గా కనిపించేందుకు జుట్టుకు, గడ్డానికి రంగులు వేసుకున్న 24 ఏళ్ల యువకుడిని అధికారులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on  19 Jun 2024 10:00 PM IST
వృద్ధ ప్రయాణీకుడిలా జుట్టుకు, గడ్డానికి రంగులు వేసుకుని వెళ్లాడు.. తీరా!!

సీనియర్ సిటిజన్‌గా కనిపించేందుకు జుట్టుకు, గడ్డానికి రంగులు వేసుకున్న 24 ఏళ్ల యువకుడిని అధికారులు అరెస్ట్ చేశారు. కెనడాకు విమానంలో వెళ్లేందుకు ప్రయత్నించగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలోని టెర్మినల్-3లో గురు సేవక్ సింగ్ (24) మంగళవారం సీఐఎస్‌ఎఫ్ అధికారులకు పట్టుబడ్డాడు. అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

భద్రతా తనిఖీల సమయంలో పాస్‌పోర్ట్ లో ఉన్న రష్విందర్ సింగ్ సహోటా, 67 అనే పేరుతో విదేశాలకు చెక్కేయాలని భావించాడు. అతను ఢిల్లీ నుండి ఎయిర్ కెనడా విమానంలో ఎక్కాల్సి ఉండగా అధికారులకు అనుమానం వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. పాస్‌పోర్ట్‌లో ఉన్న వ్యక్తికి.. విమానం ఎక్కాలని వచ్చిన వ్యక్తికి గొంతు, చర్మం అతని వయస్సుతో సరిపోలడం లేదని గుర్తించిన CISF అధికారులు.. అతని కార్యకలాపాలపై నిఘా పెట్టారు. నిశితంగా పరిశీలించగా.. అతను తన జుట్టు, గడ్డానికి తెల్ల రంగు వేసుకున్నాడు. పెద్దవాడిగా కనిపించడానికి అద్దాలు కూడా పెట్టుకున్నాడు. విచారణలో, వ్యక్తి తన ఒరిజినాలిటీ గురించి వెల్లడించాడు. అతని ఫోన్‌లో నిజమైన పాస్‌పోర్ట్ ఫోటోను కూడా అధికారులు గుర్తించారు.

Next Story