క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు.. చివరికి

ఎల్‌బీ నగర్‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంట్లో శవమై కనిపించాడు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల వల్ల వచ్చిన ఆర్థిక నష్టాల కారణంగా

By Medi Samrat  Published on  17 April 2024 3:30 PM IST
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు.. చివరికి

ఎల్‌బీ నగర్‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంట్లో శవమై కనిపించాడు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల వల్ల వచ్చిన ఆర్థిక నష్టాల కారణంగా అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య పోలీసులకు సమాచారం అందించారు. హరి రవికుమార్ (44) ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ధృవీకరించారు. తాను ఉదయం 9:15 గంటలకు పనికి వెళ్లి మధ్యాహ్నం 12:30 గంటలకు తిరిగి వచ్చేసరికి గదిలో తన భర్త సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడని ఆమె పోలీసులకు తెలిపింది. అతడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ రవికుమార్‌ చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.

క్రిప్టోకరెన్సీలో గణనీయమైన మొత్తంలో డబ్బు పోగొట్టుకోవడంతో తన భర్త తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని భార్య వెల్లడించారు. అతను క్రిప్టోకరెన్సీతో సహా వివిధ వ్యాపారాలు చేశాడని.. ఏవి కూడా లాభాలు తెచ్చిపెట్టలేదని వాపోయింది. రవికుమార్‌కు 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Next Story