తన ప్రియురాలి భర్త చేతిలో చిక్కుకోకుండా ఉండటానికి జైపూర్‌లోని భవనం ఐదవ అంతస్తు నుండి దూకి 29 ఏళ్ల వ్యక్తి మరణించాడని పోలీసులు బుధవారం తెలిపారు. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహ్సిన్‌గా గుర్తించారు. వివాహితతో మృతుడు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. మహిళ తన మైనర్ కుమార్తెతో పాటు ఇద్దరు ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనంలో అద్దెకు నివసిస్తున్నారని వారు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెళ్లైన మహిళతో నైనిటాల్‌కు చెందని మొహ్సిన్ పరిచయం పెంచుకున్నాడు. అది ప్రేమగా మారింది. అంతే ఇద్దరూ కలిసి పారిపోయారు. ఆ తర్వాత ఆమె కోసం భర్త వెతుకులాట ప్రారంభించాడు. చివరకు ఆమె జైపూర్‌లో ఉందని తెలుసుకున్నాడు.
ఆదివారం మహిళ భర్త.. మొహసిన్‌తో కలిసి ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అతడిని చూసి భయాందోళనకు గురైన మొహసిన్ ఇంటి బాల్కనీ ఐదవ అంతస్థు నుంచి దూకేశాడు. మహిళ అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ అతను సోమవారం (డిసెంబర్ 13) రాత్రి మరణించాడని స్టేషన్ హౌస్ ఆఫీసర్, ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్, బల్వీర్ సింగ్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఎన్‌ఆర్‌ఐ సర్కిల్ సమీపంలోని ఫ్లాట్‌కు మొహ్సిన్, మహిళ మారారు. గతంలో వారు జైపూర్‌లోని వేరే ప్రాంతంలో నివసిస్తున్నారని ఆయన చెప్పారు. మహిళ, ఆమె భర్త పారిపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం పోస్ట్‌మార్టం అనంతరం మొహసిన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.