కోడికత్తి గుచ్చుకొని వ్య‌క్తి మృతి

Man Dead In East Godavari. ఏపీలో సంక్రాంతి సందర్భంగా భారీగా కోడి పందేలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..

By Medi Samrat  Published on  15 Jan 2023 8:15 PM IST
కోడికత్తి గుచ్చుకొని వ్య‌క్తి మృతి

ఏపీలో సంక్రాంతి సందర్భంగా భారీగా కోడి పందేలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..! అయితే ఈ కోడిపందేల్లో ఓ వ్యక్తి ప్రాణం పోయింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడికత్తి గుచ్చుకొని పద్మారావు అనే యువకుడు మృతిచెందాడు. కోడిపందాల బరిలో తొక్కిసలాట జరగడంతో పద్మారావుకు కోడికత్తి గుచ్చుకుంది. పద్మారావు ఊర్లో కోడిపందాలు నిర్వహిస్తుండడంతో చూసేందుకు వెళ్లాడు. బరిలో పోట్లాడుకుంటున్న కోళ్లు ఒక్కసారిగా పద్మారావు ఉన్నచోటికి దూసుకొచ్చాయి. ఈ క్రమంలో ఒక కోడికి కట్టిన కత్తి పద్మారావు నరాలకు గుచ్చుకుంది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.

కోనసీమ వ్యాప్తంగా చాలా గ్రామాల్లో కోడిపందాల బరులు ఏర్పాటు చేసి జోరుగా పందాలు నిర్వహిస్తున్నారు. కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. బరుల వద్దకు జోరుగా పందెం రాయళ్లు తరలివస్తున్నారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో గుండాట, గ్యాంబ్లింగ్‌ గేమ్‌పై నిషేధం కొనసాగుతుంది.

Next Story