నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంటూ లేఖ రాసి..
Man Committed For Suicide. ఉత్తరాఖండ్‌లో భార్య నుంచి విడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 22 April 2022 3:00 PM GMTఉత్తరాఖండ్‌లో భార్య నుంచి విడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శాంతి విహార్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు అందడంతో మార్కెట్ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి వివేక్ రాఠీ ఆ ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా, ఉరికి వేలాడుతున్న వ్యక్తి కనిపించాడు. అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతుడు కన్వాలి నివాసి మనీష్ చౌదరిగా గుర్తించారు. అతను శాంతి విహార్‌లో (ISBT సమీపంలో) అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మనీష్ 2015 నుండి పిట్కుల్‌లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా ఉన్నాడు. మనీష్‌కి 2018 లో స్వాతి అనే అమ్మాయితో వివాహం జరిగింది, అయితే.. కుటుంబ కలహాల కారణంగా, ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. వీరిద్దరికి తుక్కు అనే 2 సంవత్సరాల కుమార్తె ఉంది. భార్య వెళ్లినప్పటి నుంచి మనీష్ చౌదరి ఎంతో బాధలో ఉన్నాడు. చివరికి అతడు ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో "స్వాతీ, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు విడిపోయి జీవిస్తున్నావు, కానీ నువ్వు లేకుండా నేను జీవించలేను. అందుకే ఇప్పుడు నేను వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. మన బిడ్డను ఎప్పుడూ తిట్టకు '' అని ఉంది. తన మరణానికి స్వాతిపై ఎలాంటి నిందలు వేయకూడదని మనీష్ రాశాడు.