భార్యను కిరాతకంగా హత్య చేసిన భ‌ర్త‌.. తల పట్టుకుని తిరుగుతూ..

Man Brutally Murdered his wife in Hyderabad. హైదరాబాద్ లో ఓ వ్యక్తి భార్య తల పట్టుకుని తిరుగుతూ.. చివరికి పోలీసు స్టేషన్ కు

By Medi Samrat  Published on  10 Dec 2021 2:28 PM GMT
భార్యను కిరాతకంగా హత్య చేసిన భ‌ర్త‌.. తల పట్టుకుని తిరుగుతూ..

హైదరాబాద్ లో ఓ వ్యక్తి భార్య తల పట్టుకుని తిరుగుతూ.. చివరికి పోలీసు స్టేషన్ కు చేరుకున్నాడు. రాజేంద్రనగర్ పరిధిలోని ఇమాద్ నగర్ లో ఓ వ్యక్తి భార్యను కిరాతకంగా హత్య చేశాడు. నిద్రిస్తున్న భార్య గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత భార్య తల తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 14 ఏళ్ల క్రితం ఫర్వేజ్ తో సమ్రీన్ బేగంకు వివాహం జరిగింది. భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ గతంలో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు, బంధువులు నచ్చజెప్పి గతేడాది మళ్లీ పెళ్లి చేశారు. ఫర్వేజ్ తీరులో ఎటువంటి మార్పు లేదు. భార్యపై అనుమానంతో వేధించసాగాడు. ఆమె నిద్రపోతున్న సమయంలో ఆమెను చంపాడు. గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమ్రీన్ బేగంకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. తలతో పోలీస్ స్టేషన్ కు నిందితుడు రావడం కలకలం కలిగించింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో తరచూ పర్వేజ్, సమ్రిన్ ల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని.. చివరికి ఇలాంటి దారుణానికి ఒడిగడుతాడని అనుకోలేదని సమ్రీన్ బంధువులు తెలిపారు. ఏడాది క్రితం పెద్దమనుషుల ద్వారా భార్య సమ్రిన్‌కు నచ్చచెప్పించి మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాడని.. గురువారం రాత్రి మళ్లీ భార్యా భర్తల మధ్య గొడవ జరగడంతో పర్వేజ్, భార్య సమ్రిన్‌ను కత్తితో గొంతుకోసి హత్యచేశాడని అన్నారు. చంపిన తర్వాత పోలీసుల దగ్గర లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story
Share it