భర్తపై పోలీసుల‌కు ఫిర్యాదుచేసిన‌ భార్య..ఎందుకంటే..

Man booked for having ‘unnatural sex’ with wife. 'అసహజ శృంగారం' చేసినందుకు భర్తపై బాధిత భార్య ఫిర్యాదు చేసినట్లు బుధవారం

By Medi Samrat
Published on : 7 July 2022 6:29 PM IST

భర్తపై పోలీసుల‌కు ఫిర్యాదుచేసిన‌ భార్య..ఎందుకంటే..

'అసహజ శృంగారం' చేసినందుకు భర్తపై బాధిత భార్య ఫిర్యాదు చేసినట్లు బుధవారం నాడు గ్వాలియర్ జిల్లా అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హజీరా ప్రాంతంలోని చందన్‌పురాకు చెందిన 25 ఏళ్ల యువతికి నగరంలోని గోలా కా మందిర్ లోసిటీకి చెందిన సురేష్‌తో ఆరు నెలల క్రితం వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత తన భర్తతో బలవంతంగా అసహజ సంభోగానికి పాల్పడ్డాడని మహిళ పోలీసులకు తెలిపింది.

మొదట ఈ విషయం తల్లికి తెలియజేయడంతో సురేష్ ఆమెను కొట్టడం ప్రారంభించాడు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఆమెను దూషించడం ప్రారంభించాడు. అతడి టార్చర్ తో విసిగిపోయిన మహిళ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని భర్తపై ఫిర్యాదు చేసింది. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రాజేష్ దండోటియా మాట్లాడుతూ.. ఫిర్యాదు మేరకు పోలీసులు అసహజ లైంగికత, మానసిక మరియు శారీరక వేధింపుల సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని దండోతియా తెలిపారు.










Next Story