మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. భరత్ విశ్వకర్మ (16) అనే బాలుడు 'భాయ్ దూజ్' పండుగ సందర్భంగా తన సోదరి ఇంటికి వెళ్లి వస్తుండగా, గుడ్డా పటేల్ అనే వ్యక్తి ఒక్కసారిగా దాడి చేశాడు. నిందితుడు మొదట ఇనుప రాడ్తో కొట్టి, ఆపై హత్తీరంతో (Hammer) తలపై పదే పదే బాదడంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు.
హత్య తర్వాత నిందితుడు చేసిన పని చూసి స్థానికులు హతాశులయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నిందితుడు చనిపోయిన బాలుడి తల నుంచి వచ్చిన రక్తాన్ని తాగి, మాంసాన్ని తినే ప్రయత్నం చేశాడు. అనంతరం ముఖానికి రక్తం పూసుకుని పొలాల్లోకి పారిపోయాడు. గ్రామస్తులు, పోలీసులు వెంబడించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు గతంలో తన భార్యను కూడా చంపి జైలుకు వెళ్లి వచ్చాడని, అతని మానసిక స్థితిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు.