చిత్తూరు జిల్లాలో పండగపూట విషాదం.. పొట్టేలుకు బదులు వ్యక్తి తల నరికివేత

Man beheaded instead of sheep in chittoor's valasapalle. పశువుల పండుగలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో పొట్టేలుకు బదులు వ్యక్తి తల నరికివేయబడింది.

By అంజి  Published on  17 Jan 2022 3:44 AM GMT
చిత్తూరు జిల్లాలో పండగపూట విషాదం.. పొట్టేలుకు బదులు వ్యక్తి తల నరికివేత

పశువుల పండుగలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో పొట్టేలుకు బదులు వ్యక్తి తల నరికివేయబడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని వలసపల్లెలో తీవ్ర కలకలం రేపింది. ఎన్నో ఏళ్లుగా ఆచారంలో భాగంగా వలసపల్లెలో పశువుల పండుగను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద పూజలు అనంతరం.. పొట్టేలు బలి ఇచ్చేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. బలి కోసం సిద్ధం చేసిన పొట్టేలును సురేష్‌ (35) అనే వ్యక్తితో పాటు పలువురు కదలకుండా పట్టుకున్నారు.

అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పొట్టేలు తలపై వేటు వేయ్యబొయి.. సురేష్‌ తలపై కత్తితో వేటేశాడు. దీంతో సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసిన గ్రామస్తులు ఒక్కక్షణం కంగుతున్నారు. సురేష్‌ మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పనికి.. మరో వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. మృతుడి కుటుంబంలో ఏడుపులు మిన్నంటాయి.

Next Story
Share it