క్ష‌మించు త‌ల్లీ.. నీ కొడుకు బ‌ల‌హీనుడ‌య్యాడు అంటూ లేఖ రాసి..

Man attempts suicide at Delhi's Rohini court. ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈరోజు ఓ యువకుడు మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

By Medi Samrat  Published on  31 March 2023 6:14 PM IST
క్ష‌మించు త‌ల్లీ.. నీ కొడుకు బ‌ల‌హీనుడ‌య్యాడు అంటూ లేఖ రాసి..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈరోజు ఓ యువకుడు మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని రోహిణి కోర్టులో ఉన్న అంబులెన్స్ సహాయంతో ప్రాణాపాయ స్థితిలో సమీపంలోని సరోజ్ ఆసుపత్రికి తరలించారు. యువకుడి నుంచి సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లో తన తల్లికి క్షమాపణలు చెబుతున్నాడు. ఆ వ్యక్తి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని చెబుతున్నారు.


ఆంగ్లంలో రాసిన సూసైడ్ నోట్‌లో ఆ యువ‌కుడు తన తల్లికి క్షమాపణలు చెప్పినట్లు రాశాడు. క్షమించు తల్లీ, మీ కొడుకు చాలా బలహీనంగా మారాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నిన్ను చాలా మిస్సయ్యాను.. క్షమించండి. నేను చాలా ప్రయత్నించాను.. కానీ ఏమీ చేయలేకపోయాను. ట్రిపికి చాలా చాలా ప్రేమతో.. అని నోట్లో రాసి ఉంది. యువకుడి పేరు దల్జీత్ అని పోలీసులు తెలిపారు. అతను గుర్గావ్ నివాసి. ఆ వ్యక్తి చాలా ఒత్తిడిలో ఉన్నాడని.. ప్రస్తుతం ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు దర్యాప్తులో నిమగ్నమై ఉందని పోలీసులు తెలిపారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story