ఆ విషయం తెలిసి విడాకులు కోరిన భార్య.. కొడవలితో దాడి చేసిన భర్త

Man attacks wife with machete for filing divorce. ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లయిందని, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసి విడాకులు కోరిన భార్యపై దారుణంగా దాడి చేసిన

By అంజి  Published on  12 March 2022 9:03 PM IST
ఆ విషయం తెలిసి విడాకులు కోరిన భార్య.. కొడవలితో దాడి చేసిన భర్త

ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లయిందని, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసి విడాకులు కోరిన భార్యపై దారుణంగా దాడి చేసిన వ్యక్తిని కర్ణాటక పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ఘటన గడగ్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. అరెస్టు చేసిన వ్యక్తిని హుబ్బళ్లి నివాసి మహ్మద్ ఎజాజ్ షిరూర్ (30)గా గుర్తించారు. అతను అపూర్వ పురాణిక్ అలియాస్ అర్ఫా భానుని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అపూర్వ తన పేరు మార్చుకుంది. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎజాజ్‌కి అప్పటికే పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆ విషయాన్ని తనకు తెలియకుండా దాచిపెట్టాడని ఆమె ఏడాది క్రితం తెలుసుకుంది.

తరువాత ఆమె తన తల్లిదండ్రులతో గడగ్‌లో నివసించడం ప్రారంభించింది. ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసింది. ఆమె తదనంతరం విడాకుల కోసం దారఖాస్తు చేసుకుంది. కాగా కేసు విచారణ కోసం శుక్రవారం జాబితా చేయబడింది. గురువారం ఉదయం విచారణకు ఒకరోజు ముందు, అపూర్వ తన ఇంటి సమీపంలోని మైదానంలో తన పొరుగున ఉన్న రవితో కలిసి స్కూటర్ నడపడం నేర్పుతున్నప్పుడు, ఎజాజ్ ఆమెపై కొడవలితో దాడి చేశాడు. ఎజాజ్ కొన్ని రోజులుగా అపూర్వ కదలికలను అనుసరిస్తున్నట్లు సమాచారం.

స్థానికులు అపూర్వను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న అపూర్వ, ఎజాజ్‌లు 2018లో వివాహం చేసుకున్నారని, అయితే అపూర్వ తల్లిదండ్రులు దీనికి అంగీకరించలేదని పోలీసులు తెలిపారు. ఆ దంపతులకు ఒక బిడ్డ కూడా ఉంది. ఆటో రిక్షా డ్రైవర్ అయిన ఎజాజ్ తన వృత్తిని కూడా దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే శ్రీ రామ్ సేన సమన్వయకర్త రాజు ఖానప్పనవర్ మాట్లాడుతూ.. కుటుంబ నేపథ్యాన్ని తనిఖీ చేసిన తర్వాత ఎజాజ్ ఆమెను ట్రాప్ చేసి, తరువాత ఆమెను విడిచిపెట్టాడని చెప్పారు. హిందూ బాలికలను ట్రాప్ చేసే నెట్‌వర్క్ ఉందా లేదా అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Next Story