భూమి అమ్మాలంటూ అత్తింటిపై విరుచుకుప‌డ్డ అల్లుడు..

Man Attack On Wife's Family. కృష్ణాజిల్లా మైలవరం మండ‌లం వెదురుబిడెం గ్రామంలో దారుణం జ‌రిగింది. కుటుంబ కలహాలతో

By Medi Samrat  Published on  18 Oct 2021 3:43 AM GMT
భూమి అమ్మాలంటూ అత్తింటిపై విరుచుకుప‌డ్డ అల్లుడు..

కృష్ణాజిల్లా మైలవరం మండ‌లం వెదురుబిడెం గ్రామంలో దారుణం జ‌రిగింది. కుటుంబ కలహాలతో అల్లుడు కత్తితో దాడి చేయ‌డంతో నలుగురికి తీవ్ర‌ గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. వివరాళ్లోకివెళ్తే.. వెదురుబిడెం గ్రామానికి చెందిన కొలుసు కొండలరావు(40) కు ముగ్గురు కుమార్తెలు. మొదటి కుమార్తె ధనలక్ష్మికి గన్నవరం మండలం బల్లిపర్రు గ్రామానికి చెందిన వీర్ల రాంబాబు( 30) తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. ధనలక్ష్మి, రాంబాబు దంప‌తుల‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు.

అయితే.. పెళ్లి సమయంలో ఇచ్చిన భూమిని అమ్మమని రాంబాబు ప్రతిరోజు గొడవ చేస్తుండగా.. ధనలక్ష్మీ ఆదివారం సాయంత్రం మూడు గంటల సమయంలో పుట్టింటికి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అల్లుడు రాంబాబు.. నిద్రిస్తున్న మామ కొండలరావు, అత్త రమణ, భార్య ధనలక్ష్మి, మరదలు భవానిలపై కత్తితో విఛ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. ఈ దాడిలో వారు తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు. వారిని 108 సిబ్బంది మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించ‌గా.. మామ కొండలరావు, అత్త, భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు.


Next Story
Share it