కత్తితో పొడిచి తన ప్రియురాలిని తీవ్రంగా గాయపరిచినందుకు శనివారం థానేలో 32 ఏళ్ల వ్యక్తిని భివాండి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు నిందితుడితో పారిపోవడానికి నిరాకరించింది. దీంతో ఆమెపై కోపంతో విచక్షణారహితంగా దాడి చేసాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 23న ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పనికి వెళ్తున్న 30 ఏళ్ల మహిళపై నిందితుడు రాజేష్ భారతి అఘాయిత్యానికి పాల్పడి కత్తితో దాడికి పాల్పడ్డాడని సమాచారం అందిందని తెలిపారు. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలైనట్లు భివాండి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు. నిందితుడిపై సెక్షన్ 307 (హత్య ప్రయత్నం), ఐపిసిలోని ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశామని.. తదుపరి విచారణ జరుగుతోందని అధికారి తెలిపారు.