వితంతు పింఛన్ ఇప్పిస్తానని చెప్పి 75 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

Man arrested for raping 75-yr-old woman in Gujarat. ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో.. వితంతు పింఛను తీసుకోడానికి సహాయం

By Medi Samrat  Published on  11 Jun 2022 10:54 AM GMT
వితంతు పింఛన్ ఇప్పిస్తానని చెప్పి 75 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో.. వితంతు పింఛను తీసుకోడానికి సహాయం చేస్తాననే నెపంతో గుజరాత్ రాష్ట్రంలో 75 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న ఆభరణాలను కూడా దోచుకున్నాడు. హస్ముఖ్ దేవిపూజక్ అనే వ్యక్తి వయోజన వృద్ధురాలిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆమె ఆభరణాలతో పారిపోయాడని పోలీసులు తెలిపారు. బొటాడ్ పోలీసులు ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ నంబర్‌ను తెలుసుకుని నిఘాను ఉంచారు. 24 గంటల్లో అతన్ని అరెస్టు చేశారు.

పోలీసు ఇన్‌స్పెక్టర్ J.V. చౌదరి మాట్లాడుతూ, "బాధితురాలిని బుధవారం మధ్యాహ్నం నిందితుడు సంప్రదించాడు, అతను ఆమె ఫోన్ నంబర్‌ను తీసుకొని వితంతు పింఛను ఫారమ్‌ను నింపడంలో ఆమెకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అతను ఆమెకు మళ్లీ కాల్ చేస్తానని హామీ ఇచ్చాడు "ఒక గంట తర్వాత నిందితుడు రమీలాబెన్‌ను ఆమె నివాసం నుండి ఎక్కించుకుని బొటాడ్ కలెక్టర్ కార్యాలయం వెనుక నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. ముందుగా ఆమె ఆభరణాలు లాక్కొని, ఆపై ఆమెపై అత్యాచారం చేశాడు." ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని, కుటుంబ సభ్యులకు హాని చేస్తానని రమీలాబెన్‌ను బెదిరించాడు. ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని నిందితుడు ఆమె చేతిలో రూ.100 పెట్టి పారిపోయాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

నిందితుడిని గతంలో ఎన్నడూ కలవలేదని, అతడి పేరు తనకు తెలియదని పోలీసులకు చెప్పింది. ఆమె బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా దాని రంగు కూడా గుర్తుకు రాలేదని, అతని వయస్సు దాదాపు 30 ఉంటుందని పోలీసులకు తెలిపింది. అయితే అతను బాధితురాలికి ఫోన్ చేసిన ఫోన్ నంబర్ మాత్రమే పోలీసులకు దొరికింది. పోలీసు శాఖ ఈ నంబర్‌పై నిఘా ఉంచింది. 24 గంటల్లో దేవిపూజక్‌ను శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు.














Next Story