వికలాంగురాలైన‌ మహిళపై భర్తతో సహా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

వికలాంగురాలైన‌ మహిళపై ఆమె భర్తతో సహా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.

By Medi Samrat
Published on : 20 March 2025 4:03 PM IST

వికలాంగురాలైన‌ మహిళపై భర్తతో సహా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

వికలాంగురాలైన‌ మహిళపై ఆమె భర్తతో సహా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. భర్తను అరెస్టు చేశామని మరో ఐదుగురి కోసం గాలింపు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అగర్తలాలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టు చేసిన నిందితుడు జోగేంద్రనగర్ ప్రాంతంలోని తన అత్తమామల ఇంట్లో నివసించేవాడు. గత శుక్రవారం అతను, అతని స్నేహితులు అందరూ తాగిన మత్తులో ఉన్నప్పుడు భార్యపై సామూహిక అత్యాచారం చేశారు.

"రేప్ బాధితురాలి భర్త, అతని స్నేహితులపై మార్చి 14న సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశాము. భర్తను అరెస్టు చేసాము. అతను నేరం చేసినట్లు అంగీకరించాడు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది" అని అమ్తాలి పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ సుస్మితా దేబ్‌నాథ్ విలేకరులకు తెలిపారు. భార్యను రక్షించాల్సిన భర్తే ఇలాంటి దారుణానికి తెగబడడంతో స్థానికులు అతడిని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Next Story