శృంగారంలో పాల్గొనలేదని స్నేహితుడిని చంపిన యువకుడు..!

Man arrested for bludgeoning friend to death. కొందరు తమ కోరికలు తీర్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. జెండర్‌ను పట్టించుకోకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు.

By అంజి  Published on  29 Oct 2021 5:16 PM IST
శృంగారంలో పాల్గొనలేదని స్నేహితుడిని చంపిన యువకుడు..!

కొందరు తమ కోరికలు తీర్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. జెండర్‌ను పట్టించుకోకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. గత కొంత కాలంగా యువకులపై, పెంపుడు జంతువులపై నీచులు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నవీ ముంబైలో కోరికను తీర్చలేదని ప్రాణ స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్‌ 22న రాత్రి విజయ్‌ మస్కే (27), రూపేష్ (30) అనే ఇద్దరు స్నేహితులు కరావే గ్రామంలోని కేంద్రీయ విహార్‌ వద్ద సర్వీస్‌ రోడ్డులో ఆగి ఉన్న బస్సు ఎక్కారు. అప్పటికే ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. ఈ సమయంలోనే విజయ్‌ తన విచిత్ర కోరికను బయటపెట్టాడు.

తనతో శృంగారంలో పాల్గొనాలంటూ రూపేష్‌ను ఒత్తిడికి గురి చేయగా... దీనికి రూపేష్‌ ఒప్పుకోలేదు. దీంతో కోపం తెచ్చుకున్న విజయ్‌.. రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్‌ టైల్స్‌తో రూపేష్‌ తలపై బాదాడు. దీంతో రూపేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత నిందితుడే జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. తన స్నేహితుడిని ఎవరో చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిందితుడు విజయ్‌. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌ మస్కే విచారించారు. విజయ్‌ ఎదో దాస్తున్నాడన్న అనుమానంతో.. పోలీసులు తమదైన శైలిలో విచారించాడు. దీంతో విజయ్‌ అసలు విషయం చెప్పగా.. అతన్ని అరెస్ట్‌ చేసినట్లు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర పాటిల్‌ తెలిపారు.

Next Story