మహిళ నగ్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌.. మరికొంత అమ్మాయిలను కూడా..

Man arrested for blackmailing woman and extorting money. ఓ మహిళను ఆమె వ్యక్తిగత చిత్రాలు, వీడియోలతో బెదిరించి డబ్బులు వసూలు చేసి

By అంజి  Published on  22 Jan 2022 3:15 PM GMT
మహిళ నగ్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌.. మరికొంత అమ్మాయిలను కూడా..

ఓ మహిళను ఆమె వ్యక్తిగత చిత్రాలు, వీడియోలతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన 32 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న సాహిల్ సచ్‌దేవా అనే నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ నివాసి. బాధితురాలు (32) షాహదారా పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో, 2021 అక్టోబర్‌లో ఒక మ్యాట్రిమోనియల్ సైట్‌లో నిందితుడిని కలిశానని. తనను పెళ్లి చేసుకునే సాకుతో నిందితుడు తనతో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని తెలిపారు. వీడియో కాల్స్‌లో ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. డబ్బులు ఇవ్వకుంటే తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. రెండు నెలల్లో ఆమె నుంచి రూ.2 లక్షలు దోపిడీ చేశాడు.

నిత్యం రహస్య స్థావరాలు మార్చే నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక విశ్లేషణ సహాయంతో బృందం అతని స్థావరాలను గుర్తించింది. అతను న్యూ ఢిల్లీలోని నెబ్ సరాయ్ సాకేత్‌లో ఉన్నట్లు కనుగొనబడింది. అతని రహస్య స్థావరంపై దాడి చేసి నిందితుడు సాహిల్ సచ్‌దేవాను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో, నిందితుడు తన ప్రొఫైల్‌ను మ్యాట్రిమోనియల్ సైట్‌లో రూపొందించాడని, పెళ్లి గురించి తప్పుడు వాగ్దానాలతో పని చేసే అమ్మాయిలను టార్గెట్ చేయడం ప్రారంభించాడని వెల్లడించాడు. వీడియో కాల్స్ సమయంలో వారి న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడని తెలిసింది. అతని వద్ద నుంచి నలుగురికి పైగా అమ్మాయిల నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘజియాబాద్, భోపాల్, ఢిల్లీకి చెందిన మరికొంత మంది అమ్మాయిలతో కూడా ఇలాగే చేసినట్లు విచారణలో తేలింది. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి.


Next Story
Share it