డేటింగ్‌లో ఇద్దరు వ్యక్తులు.. హత్యకు కార‌ణ‌మైన‌ వీడియో..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఘజియాబాద్ అంకుర్‌విహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మే 8న జ‌రిగిన‌ హత్య కేసును పోలీసులు బట్టబయలు చేశారు.

By Medi Samrat  Published on  12 May 2024 1:19 PM IST
డేటింగ్‌లో ఇద్దరు వ్యక్తులు.. హత్యకు కార‌ణ‌మైన‌ వీడియో..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఘజియాబాద్ అంకుర్‌విహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మే 8న జ‌రిగిన‌ హత్య కేసును పోలీసులు బట్టబయలు చేశారు.ఈ కేసులో ఢిల్లీలోని బ్రహ్మపురికి చెందిన ఫైమ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుడిని మేస్త్రీ సాకేంద్రగా పోలీసులు గుర్తించారు. వివ‌రాళ్లోకెళితే.. సాకేంద్ర, ఫైమ్‌ డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. ఫైమ్‌ కూడా ఒక కార్మికుడు. అంకుర్ విహార్‌లోని డిఎల్‌ఎఫ్‌లోని తన స్నేహితుడి ఖాళీ ఫ్లాట్‌లో కలవడానికి సాకేంద్ర.. ఫైమ్‌ని పిలిచాడు. ఇద్దరు రెండు సార్లు శారీరకంగా క‌లిశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఘ‌ట‌నే గొడ‌వ‌కు దారి తీసింది.

డీసీపీ రూరల్ వివేక్ చంద్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరువురు క‌లిసిన‌ స‌మ‌యంలో సాకేంద్ర డోర్ లాక్ చేసి వీడియో తీసిన‌ట్లు ఫైమ్‌కి చెప్పాడు. వీడియో విషయంలో ఫైమ్‌, సాకేంద్ర మధ్య గొడవ జరిగింది. దీంతో ఫైమ్‌.. సాకేంద్ర‌ గొంతుకోసి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం మృతుడి చేతులు, కాళ్లు కట్టేసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ కాల్ రికార్డుల ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story