నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ప్రేమజంట లక్ష్మాపూర్ అట‌వీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆ ప్రేమ‌జంట‌.. విగ‌త జీవులుగా చెట్టుకు వేలాడుతున్నారు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఘ‌ట‌నతో మృతుల కుటుంబాల‌లో విషాదం నెల‌కొంది.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మృతుల‌ను మోహన్, లక్ష్మి గా గుర్తించారు. వారం నుండి మృతదేహాలు చెట్లకి వేళాడుతుండ‌టంతో గుర్తుప‌ట్ట‌లేనంత‌గా కుళ్లిపోయాయి. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


సామ్రాట్

Next Story