నార్సింగ్ లో ప్రేమికుల ఆత్మహత్య
Lovers Commit Suicide In Medak.
By - Medi Samrat |Published on : 16 Nov 2020 9:35 AM IST

నార్సింగ్ లో ప్రేమికుల ఆత్మహత్య కలకలం సృష్టించింది. వివరాళ్లోకెళితే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ ప్రాంతానికి చెందిన సంపత్, పార్వతి ఇద్దరూ శనివారం సాయంత్రం నార్సింగ్ మంచిరేవుల ప్రాంతంలో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
అనంతరం సంపత్ తన స్నేహితుడికి ఫోన్ చేసి.. తాము పురుగుల మందు తాగామని తమను ఆస్పత్రికి తరలించాలని ఫోన్ చేసి కోరడంతో స్నేహితుడు, పోలీసుల సాయంతో నగరంలోని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పూర్తి విషయాలు తెలియాల్సివుంది.
Next Story