ప్రేమజంట ఆత్మహత్య
Lovers Commit Suicide In Mahabubabad. మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేకున్నది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో
By Medi Samrat Published on 23 Dec 2020 11:11 AM IST
ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. కలిసి జీవించలేక.. విడిపోయి బ్రతక లేక తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పంది. గార్ల మండలం రాజుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలో పదో తరగతి చదువుతున్న ప్రశాంత్(17), డిగ్రీ చదువుతున్న ఓ యువతి(21) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం సాయంత్రం వీరి ప్రేమ వ్యవహారం వారి వారి ఇళ్లలో తెలిసింది. పెద్దలు ఏమంటారోనని భయాందోళన చెందిన ప్రేమ జంట ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం రాజుతండా గ్రామపంచాయతీ పరిధి అమృతండా సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఉదయం అటుగా వెలుతున్న రైతులు కొందరు బావిలో మృతదేహాలను గమనించి తండా వాసులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. తండా వాసులు వెంటనే అక్కడికి చేరుకుని బావిలోకి మృతదేహాలు బయటకు తీయగా.. అవి తమ తండాకు చెందిన వారివేనని గుర్తించారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.