ప్రేమించిన అమ్మాయిని తగులబెట్టాలని అనుకున్నాడు

Lover sets girlfriend ablaze. ప్రేమించిన అమ్మాయిని తగులబెట్టాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి కూడా చివరికి ప్రాణాలను కోల్పోయిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  8 Feb 2021 2:51 PM GMT
Lover sets girlfriend ablaze

ప్రేమించడం.. ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే బెదిరించడం లేదంటే.. ప్రాణాలు తీసేయాలని అనుకునే ఘటనలు ఈ కాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. ఇష్టంగా ప్రేమించే ధైర్యం ఉన్న వాళ్లు.. ప్రేమించిన వాళ్లు వద్దంటే మాత్రం దేనికైనా తెగిస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనల వలన కొన్ని జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. తాజాగా ప్రేమించిన అమ్మాయిని తగులబెట్టాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి కూడా చివరికి ప్రాణాలను కోల్పోయిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ముంబయిలోని మేఘ్ వాడీ ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రేమించిన యువతిని చంపబోయి తానే ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ కాంబే అనే వ్యక్తి ఇటీవల ఒక యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అగ్నికీలల్లో చిక్కుకున్నప్పటికీ ఆమె తనను హత్య చేసేందుకు ప్రయత్నించిన విజయ్ కాంబేని గట్టిగా పట్టుకుంది. అతడు కూడా మంటల్లో ఇరుక్కుపోయాడు. కాలిన గాయాలతో ఆసుపత్రి పాలైన విజయ్ కాంబే మరణించాడు. ఆ యువతి మాత్రం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ యువతి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా విజయ్ కాంబేపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.

మృతుడు విజయ్ కాంబే, యువతి గత రెండున్నరేళ్లుగా పరిచయస్తులేనని పోలీసులు చెబుతున్నారు. విజయ్ ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడని, అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదని పోలీసులు తెలిపారు. కోపం పెంచుకున్న విజయ్ ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడని.. ఫిబ్రవరి 6న యువతి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు. ఇరుగు పొరుగు వారు వారిద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ విజయ్ మరణించాడు. ఆమె చావుబతుకుల మధ్య పోరాడుతోంది.


Next Story
Share it