జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చాగల్లు గ్రామం దగ్గర ఆగిఉన్న టూరిస్టు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద బాధితులు హసన్‌పర్తి మండలం దేవన్నపేట గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. గోవా టూర్‌కు వెళ్లి వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రావిరాల దగ్గర ఆగి ఉన్న లారీని ట్రక్కు ఢీ కొట్టింది. నగర శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story