లారీ, జీపు ఢీ.. 9 మంది దుర్మ‌ర‌ణం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు

Lorry and cruiser collision 9 people died in in Tumkur.ఓవ‌ర్‌టేక్ చేసే క్ర‌మంలో లారీ, జీపు(క్రూయిజ‌ర్‌)ను ఢీ కొట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2022 8:37 AM IST
లారీ, జీపు ఢీ.. 9 మంది దుర్మ‌ర‌ణం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు

ఓవ‌ర్‌టేక్ చేసే క్ర‌మంలో లారీ, జీపు(క్రూయిజ‌ర్‌)ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 9 మంది దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని త‌మ‌కూరు జిల్లాలో గురువారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. శిరా తాలూకా బాలిన‌హ‌ళ్లిలో గురువారం ఉద‌యం నాలుగు గంట‌ల స‌మ‌యంలో 48వ నెంబర్‌ జాతీయ ర‌హ‌దారిపై ఓ లారీ ఓవ‌ర్‌టేక్ చేసే క్ర‌మంలో జీపును ఢీ కొట్టింది. ప్ర‌మాదం ధాటికి జీపు నుజ్జునుజ్జు అయింది. ఘ‌ట‌నాస్థ‌లంలోనే 9 మంది మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను తమకూరు జిల్లా ప్రభుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

దాదాపు 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ‌గా.. ఇందులో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో జీపులో 20 మంది వ‌ర‌కు ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా.. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంపై కక్లంబెల్లా పోలీస్‌స్టేషన్‌లో కేసు న‌మోదైంది. దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంఘటనా స్థలాన్ని ఎస్పీ రాహుల్ కుమార్ షాపూర్వాడ్ సందర్శించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ మృతులంతా రోజువారి కూలీలేన‌ని తెలిపారు.

Next Story