లోన్ యాప్ వేధింపులు.. హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి సూసైడ్

హైదరాబాద్‌ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోన్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

By Knakam Karthik
Published on : 23 Jan 2025 9:28 AM IST

Hyderabad, Crime news, Loan App Harassment, Student Suicide

లోన్ యాప్ వేధింపులు.. హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి సూసైడ్

హైదరాబాద్‌ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోన్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వినాయక నగర్‌లో నివాసముంటున్న లక్ష్మారెడ్డి కుమారుడు తరుణ్ రెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం లేకపోవడంతో లోన్ యాప్‌లలో డబ్బులు తీసుకున్నాడు. అయితే సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల వేధింపులకు గురి చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. రోజురోజుకు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువ కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తరుణ్ రెడ్డి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story