ఆన్‌లైన్‌లో చూసి నోట్లను తయారు చేయడం నేర్చుకున్నారు.. ఎన్ని లక్షలను మార్కెట్ లో మార్చారంటే..

Learnt to make fake notes through YouTube. నకిలీ కరెన్సీ తయారీదారుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

By Medi Samrat  Published on  8 Jan 2022 12:05 PM GMT
ఆన్‌లైన్‌లో చూసి నోట్లను తయారు చేయడం నేర్చుకున్నారు.. ఎన్ని లక్షలను మార్కెట్ లో మార్చారంటే..

ఘజియాబాద్: నకిలీ కరెన్సీ తయారీదారుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు సూత్రధారి సహా ఏడుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు నగర్ కొత్వాలి ప్రాంతంలోని ఇస్లాంనగర్‌ లో నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నారు. వారి నుంచి రూ.6.59 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 100 నుంచి 2000 రూపాయల నోట్ల నకిలీ నోట్లు ఉన్నాయని తెలిపారు. యూట్యూబ్ నుంచి నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారని, నాలుగు నెలల్లోనే నకిలీ నోట్ల తయారీలో నిపుణుడిగా మారాడు ముఠా సూత్రధారి.

ఇస్లాంనగర్‌కు చెందిన యూనస్‌ ఇంట్లో నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నట్లు ఎస్‌వాట్‌ టీమ్‌కు తెలిసిందని ఏఎస్పీ ఆకాష్‌ పటేల్‌ తెలిపారు. సోదాలు నిర్వహించగా వారి ఇంట్లో నుంచి రూ.6.59 లక్షల విలువైన నకిలీ నోట్లు, కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, పేపర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నారు. యూనస్‌తో పాటు నగర్ కొత్వాలిలోని కల్కాగర్హికి చెందిన అమన్, మోతీ మసీదు వెనుక కైలవట్టకు చెందిన రహబర్, సోను అలియాస్ గంజా, చమన్ కాలనీకి చెందిన ఆజాద్, లాల్కువాన్‌లోని రాజ్ కాంపౌండ్‌కు చెందిన ఆలం అలియాస్ ఆశిష్, విజయనగరంలోని పురానా కైలాష్ నగర్‌కు చెందిన ఫుర్కాన్ అబ్బాసీలను సంఘటనా స్థలం నుంచి అరెస్టు చేశారు. వీరు దొంగనోట్ల చలామణీ కూడా బాగా చేసినట్లు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం ఆజాద్ ముఠా సూత్రధారి. ఆజాద్, సోనూ, యూనస్ నకిలీ నోట్లను తయారు చేయగా, ఇతర నిందితులు నకిలీ నోట్లను మార్కెట్‌లో ఖర్చు చేసేవారు. కొన్ని లక్షల్లోనే మార్కెట్ల లోకి దొంగ నోట్లు పంపించారు.


Next Story