తండ్రి పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న 27 ఏళ్ల న్యాయవాది

Lawyer Shoots Self In UP, Family Alleges Harassment By Friends. ఘజియాబాద్ జిల్లాలోని కవినగర్ కాలనీలో 27 ఏళ్ల న్యాయవాది తన తండ్రి mh

By Medi Samrat  Published on  11 July 2022 9:15 PM IST
తండ్రి పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న 27 ఏళ్ల న్యాయవాది

ఘజియాబాద్ జిల్లాలోని కవినగర్ కాలనీలో 27 ఏళ్ల న్యాయవాది తన తండ్రి లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశిష్ త్యాగి అనే వ్యక్తి శనివారం రాత్రి తన నివాసంలో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రాణాలు తీసుకున్నాడు. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం అతని తండ్రి రాకేష్ త్యాగి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు తలుపు తట్టినా లోపలి నుండి స్పందన లేదు. అనంతరం తలుపులు పగులగొట్టి గదిలోకి ప్రవేశించిన తండ్రి కుమారుడి మృతదేహాన్ని చూసి షాకయ్యాడు. తన కుమారుడి మృతదేహం పక్కన తన పిస్టల్, ఉపయోగించిన కాట్రిడ్జ్‌ను కనుగొన్నాడు ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిపించామని CO (కవీనగర్) అవనీష్ కుమార్ తెలిపారు. వేలిముద్రలు తీసుకున్నారు.

తన కొడుకు మృతికి స్థానిక రాజకీయ నాయకుడు సహా నలుగురు వ్యక్తులు కారణమని ఆశిష్ త్యాగి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఢిల్లీలో తమ కారును ఢీకొట్టిన తర్వాత తన కొడుకును ముగ్గురు స్నేహితులు వేధించారని చెప్పారు. తమతో అసభ్యంగా ప్రవర్తించారని, వాహనాన్ని రిపేర్ చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ, వారు తనను వేధిస్తూనే ఉన్నారని ఆరోపించారు. శనివారం స్థానిక రాజకీయ నాయకుడు అజయ్ పాల్ ప్రముఖ్ కార్యాలయానికి పిలిపించి వేధించారన్నారు ఆశిష్ త్యాగి తండ్రి. ఈ ఘటనతో కలత చెంది ప్రాణాలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ముగ్గురు స్నేహితులు సంజయ్ రాఠి, అనుజ్ చౌదరి, అక్షయ్ లే మరణానికి కారణమని చెప్పుకొచ్చాడు. నలుగురు నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.




Next Story