కొమురంభీం జిల్లాలో భూత‌గాదా.. ఇరువర్గాల గొడవలో ముగ్గురు మృతి

Land Disputes Causes Murder in Kumuram Bheem District. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది.

By Medi Samrat
Published on : 26 Jun 2023 5:13 PM IST

కొమురంభీం జిల్లాలో భూత‌గాదా.. ఇరువర్గాల గొడవలో ముగ్గురు మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ఇరువ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన‌ భూతగాదాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బన మండలం జక్కుపల్లికి చెందిన రెండు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా గట్టు విషయమై వివాదం నడుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సోమ‌వారం నాడు రెండు వర్గాలు పరస్కరం గొడ్డళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడి ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయ‌ప‌డిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను లింగయ్య, నర్సయ్య, బతుకమ్మగా గుర్తించారు. ఘ‌ట‌న‌పై పోలీసులకు స్థానికుల సమాచారం అందించ‌డంతో.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న‌ పలువురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Next Story