బాలుడి హత్య.. పోలీసు కస్టడీలో 'లేడీ డాన్'

ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడి హత్య కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 'లేడీ డాన్' జిక్రాను రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

By Medi Samrat
Published on : 19 April 2025 9:00 PM IST

బాలుడి హత్య.. పోలీసు కస్టడీలో లేడీ డాన్

ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడి హత్య కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 'లేడీ డాన్' జిక్రాను రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఇతర నిందితులను అరెస్టు చేయడానికి, నేరంలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆమెను కస్టడీలోకి తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిక్ర బంధువులు సాహిల్, దిల్షాద్ బాలుడు కునాల్ పై కత్తులతో దాడి చేశారు. ఇద్దరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.

తన బంధువు సాహిల్ పై గత సంవత్సరం నవంబర్‌లో కునాల్ స్నేహితులు లాలా, శంభు అనే ఇద్దరు అబ్బాయిలు దాడి చేశారని జిక్రా పోలీసులకు విచారణలో చెప్పారు. ఆ సమయంలో కునాల్ కూడా ఉన్నాడు, కానీ అతను మైనర్ కావడంతో అతని పేరు FIRలో ప్రస్తావించలేదు. కునాల్ ఈ దాడికి బాధ్యుడని జిక్రా, సాహిల్ నమ్మారు. దీంతో వారు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇతర నిందితులను గుర్తించి అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు పది బృందాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఈ హత్య గురించి మాట్లాడారు. 17 ఏళ్ల బాలుడి కేసులో న్యాయం తప్పకుండా జరుగుతుందని హామీ ఇచ్ఛారు.

Next Story