నేలపై కూర్చున్న ఓ వ్యక్తిని తన్నిన ఎస్పీ.. ఎందుకు ఆ పని చేశారంటే..?

Krishnagiri SP on video of him kicking a man in Tamil Nadu. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సరోజ్‌కుమార్ ఠాకూర్ నేలపై

By M.S.R  Published on  3 Feb 2023 1:45 PM GMT
నేలపై కూర్చున్న ఓ వ్యక్తిని తన్నిన ఎస్పీ.. ఎందుకు ఆ పని చేశారంటే..?

తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సరోజ్‌కుమార్ ఠాకూర్ నేలపై కూర్చున్న ఓ వ్యక్తిని తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఎస్పీని సంప్రదించగా ఆ వ్యక్తి మహిళలను వేధిస్తూ వచ్చాడని అన్నారు. తన్నిన వ్యక్తి మహిళలను వేధిస్తూ ఉన్నాడని, ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తుల బృందంలో ఇతడు భాగమని అన్నారు.

చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై హోసూర్ సమీపంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. ఆ కారణంగా చెలరేగిన హింసను నియంత్రించడానికి ఎస్పీ రంగంలోకి దిగారు. ఆ సమయంలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని కొట్టడం కూడా వీడియోలలో రికార్డు అయ్యాయి.

ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు మహిళలను వేధించడానికి ప్రయత్నిస్తున్నారని, వెంటనే వారిని పోలీసులు పట్టుకున్నారని అన్నారు. ఈ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, జల్లికట్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ తెలిపారు. గ్రామస్తులు కొన్ని గంటలపాటు హైవేని దిగ్బంధించి రాళ్లదాడికి పాల్పడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి జనాన్ని చెదరగొట్టారు.

Next Story