హరిహరకృష్ణ ప్రియురాలు నీహారిక ని అరెస్ట్ చేసిన పోలీసులు

Key Twist In Abdullapurmet Naveen Case Police Arrest Niharika. నవీన్ ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని హరిహరకృష్ణ తన ప్రియురాలికి ఘటనా స్థలానికి తీసుకెళ్లి మరీ చూపించాడని విచారణలో తెలిసింది.

By M.S.R  Published on  6 March 2023 8:21 PM IST
హరిహరకృష్ణ ప్రియురాలు నీహారిక ని అరెస్ట్ చేసిన పోలీసులు

Key Twist In Abdullapurmet Naveen Case


నవీన్ హత్య కేసులో నిందితుడిగా హరిహరకృష్ణను పరిగణించిన పోలీసులు, ఇప్పుడు ఆ నిందితుల లిస్ట్‌లో హరిహరకృష్ణ ప్రియురాలు నిహారిక‌, అతని స్నేహితుడైన హసన్‌ను కూడా చేర్చారు. హరిహరకృష్ణ ప్రియురాలిని ఏ3గా, స్నేహితుడు హసన్‌ను ఏ2గా పోలీసులు చేర్చారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని హరిహరకృష్ణ తన ప్రియురాలికి ఘటనా స్థలానికి తీసుకెళ్లి మరీ చూపించాడని విచారణలో తెలిసింది. హరిహరకృష్ణ ప్రియురాలికి మాత్రమే కాకుండా.. తన ఫ్రెండ్ హసన్‌కు కూడా నవీన్ మృతదేహాన్ని చూపించాడట. హత్య తర్వాత హరిహరకృష్ణకు ఖర్చుల కోసం తన ప్రియురాలు డబ్బులు 1500 రూపాయలు కూడా పంపించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు చేతికి చిక్కకుండా ఉండేందుకు ఫోన్‌లోని డేటాను కూడా డిలీట్ చేసిందని అంటున్నారు.

హత్య విషయం తెలిసి కూడా దాచారన్న కారణంతో హరిహరకృష్ణ ప్రియురాలు నీహారిక, స్నేహితుడు హసన్ లను కూడా పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. హరిహరకృష్ణను పలుమార్లు హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి మర్డర్ సీన్ రీకన్ స్ట్రక్షన్ ప్రక్రియ చేపట్టారు.


Next Story