బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసుతో యువతికి సంబంధం లేదు

Btech Student Naveen Murder Case. నవీన్ హత్య కేసుతో యువతికి ఎలాంటి సంబంధం లేదని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు

By Medi Samrat  Published on  4 March 2023 7:37 PM IST
బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసుతో యువతికి సంబంధం లేదు

Naveen File Photo



బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసుతో యువతికి ఎలాంటి సంబంధం లేదని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. హత్యలో యువతి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని.. నిందితుడు హరిహర కృష్ణ నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నామని పోలీసులు తెలిపారు. అతడికి సహకరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని.. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండడంతో ఇపుడే స్పందించలేమన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసులు సీన్ రికన్ స్ట్రక్షన్ పూర్తి చేశారు. నవీన్ హత్యకు అమ్మాయికి సంబంధం ఉండొచ్చని నిందితుడు హరిహర కృష్ణ తండ్రి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో నవీన్ హత్యకు అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నవీన్ హత్యకి అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.

సీన్ రీకన్‌స్ట్రక్షన్ లో భాగంగా ముసరాంబాగ్‌లో నిందితుడు హరిహరకృష్ణ సోదరి ఇంటికి పోలీసులు తీసుకెళ్లారు. హరిహరకృష్ణతో పాటు సోదరిని పోలీసులు ప్రశ్నించారు. అనంతరం నిందితుడిని అంబర్‌పేట్ నుంచి అబ్ధుల్లాపూర్‌మెట్‌కు తీసుకెళ్లారు. హత్య చేసిన తర్వాత తన అత్యంత స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లి నిందితుడు బట్టలు మార్చుకున్నాడు. ప్రస్తుతం నవీన్‌ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.


Next Story