విశాఖపట్నంలో జాయ్ జమీమా స్కాండల్.. కీలక సూత్రధారి అరెస్టు

గత ఐదు సంవత్సరాలుగా విశాఖపట్నం నగరానికి చెందిన అనేక మంది ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్న అధునాతన క్రిమినల్ నెట్‌వర్క్ ను నిర్వహిస్తూ ఉన్నారు

By Medi Samrat
Published on : 19 May 2025 10:08 PM IST

విశాఖపట్నంలో జాయ్ జమీమా స్కాండల్.. కీలక సూత్రధారి అరెస్టు

గత ఐదు సంవత్సరాలుగా విశాఖపట్నం నగరానికి చెందిన అనేక మంది ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్న అధునాతన క్రిమినల్ నెట్‌వర్క్ ను నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తులో విశాఖపట్నం పోలీసులు మరో కీలక నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌లో కీలక సూత్రధారిగా అభివర్ణించిన గ్లోబల్ ఐటీసీ కంపెనీ సీఈఓ పొలమరశెట్టి రత్న రాజును విమానాశ్రయ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. రత్న రాజు, ఈ ముఠా నాయకుడు అని చెప్పబడుతున్న జాయ్ జమీమా మధ్య ఆర్థిక లావాదేవీలను దర్యాప్తు అధికారులు గుర్తించారు. జాయ్ జమీమాను ఇప్పటికే అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, ఈ ముఠా ఉన్నత స్థానాలలో ఉన్న పురుషులను లక్ష్యంగా చేసుకుని టార్గెట్ చేసింది. బాధితులకు మత్తుమందు ఇచ్చి, అసభ్యంగా ఫోటోలను తీసి, ఆపై పెద్ద మొత్తంలో డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసేవారు. చెల్లించడానికి నిరాకరించిన వారు బెదిరింపులను ఎదుర్కొన్నారు. దర్యాప్తులో ఇప్పటికే బచ్చు వేణు భాస్కర్ రెడ్డి, అవినాష్ బెంజమిన్ సహా అనేక మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జాయ్ జమీమా, రత్న రాజులను విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్ చేశారు.

Next Story