కేరళలోని కొల్లంకు చెందిన 29 ఏళ్ల మహిళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించింది. అయితే ఆమె భర్త కట్నం కోసం వేధించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. 2014లో కొల్లం నివాసి అయిన సతీష్‌ను వివాహం చేసుకున్న అతుల్య శేఖర్, షార్జాలో ఉంటోంది. జూలై 18-19 మధ్య సతీష్ తన కుమార్తె కడుపుపై తన్నాడని, తలపై ప్లేట్‌తో కొట్టాడని, ఫలితంగా మరణించిందని ఆమె తల్లి ఆరోపించింది.
వివాహం అయినప్పటి నుండి వరకట్నం కోసం వేధింపులు ఎదుర్కొంటూ ఉందని ఆరోపించారు. సతీష్ కు 40 సవర్ల బంగారు ఆభరణాలు, ఒక బైక్ ఇచ్చామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. గల్ఫ్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. తన 30వ పుట్టిన రోజు నాడే అతుల్య మృతిచెందడం అత్యంత బాధాకరం. అంతేకాదు, ఆమె కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఇలా జరిగింది. ప్రస్తుతం సతీష్ పై హత్య కేసు నమోదైంది.