తన కారుపై ఆనుకుని ఉన్న ఆరేళ్ల బాలుడిని తన్నిన కేరళకు చెందిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ సంఘటన యొక్క CCTV ఫుటేజీలో కారు నడుపుతున్న వ్యక్తి బయటకు వచ్చినప్పుడు, ఒక బాలుడు రద్దీగా ఉన్న రహదారిపై నిలబడి ఉన్న తెల్లటి కారుకు ఆనుకుని కనిపించాడు. ఇంతలో అతడు బాలుడితో ఏదో చెప్పి అతని ఛాతీపై గట్టిగా తన్నాడు. రాజస్థాన్ నుండి వలస వచ్చిన కార్మిక కుటుంబానికి చెందిన బాలుడు నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు.. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తులు ఆ కారు ఉన్న వ్యక్తిని ప్రశ్నించడం సీసీటీవీలో రికార్డు అయింది. కొంతమంది స్థానికులు కారు చుట్టూ గుమిగూడి డ్రైవర్‌ను ప్రశ్నించారు.
పొన్నంపాలెంకు చెందిన షిహ్‌షాద్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి అయిన ఓ న్యాయవాది పోలీసులకు సమాచారం అందించాడు. షిహ్‌షాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విడుదల చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు న్యూస్ ఛానల్స్ దాకా పాకడంతో పోలీసులు రంగంలోకి దిగి శుక్రవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ అసెంబ్లీ స్పీకర్, తలస్సేరి ఎమ్మెల్యే ఏఎన్ శ్యాంసీర్ తెలిపారు.