కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించిన భార్య.. టార్చర్ చూపిస్తున్న భర్త.. ఏం జరిగిందంటే..
Kerala man assaults his wife when she refuses to donate her kidney. అప్పులు తీర్చేందుకు భార్య తన కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించినందుకు కేరళ రాష్ట్రంలోని
By Medi Samrat Published on 27 Nov 2021 11:40 AM GMT
తిరువనంతపురం : అప్పులు తీర్చేందుకు భార్య తన కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించినందుకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఓ వ్యక్తి తన భార్య, పిల్లలను ఇష్టం వచ్చినట్లు కొట్టడం మొదలు పెట్టాడు. దీంతో ఈ విషయాన్ని కొందరు పోలీసులకు తెలియజేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నాడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాజన్ అనే వ్యక్తి భారీగా అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చలేకపోతుండడంతో సాజన్ తన భార్య కిడ్నీని అమ్మేయాలని అనుకున్నాడు. మొదట సాజన్ భార్య అందుకు సరే అని చెప్పింది.
కానీ.. ఎందుకో ఆమె మనసు మార్చుకోవడంతో ఆమె మీద కోపంగా ఉన్నాడు సాజన్. ఇప్పటి వరకూ సాజన్ రూ.4 లక్షల అప్పులు చేశాడు. దాన్ని తీర్చేందుకు అతని భార్య రూ.9 లక్షలకు బదులుగా తన కిడ్నీలో ఒకదాన్ని మలప్పురం వాసికి దానం చేసేలా ఏర్పాట్లు చేశారు. కేరళలో దాత కోసం చుట్టూ తిరిగే బ్రోకర్లు ఉన్నారు. అవసరాన్ని బట్టి వెంటనే అవసరమైన వ్యక్తులకు కిడ్నీలను విక్రయిస్తారు. వారితో సాజన్ డీల్ కుదుర్చుకున్నాడు. సాజన్ భార్యకు ఇప్పటికే పలు టెస్టులు చేశారు. సాజన్ భార్య కిడ్నీ సరిపోతుందని కూడా ఫిక్స్ అయ్యారు.
అయితే.. ఆమెను మరోసారి టెస్టులకు పంపించాలని అనుకున్న సమయంలో సాజన్ భార్య మనసు మార్చుకోవడంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెను రోజూ చితక్కొట్టడమే కాకుండా కోపాన్ని పిల్లల మీద కూడా చూపిస్తూ ఉన్నాడు. దీంతో ఆమె అతడి టార్చర్ ఇక భరించలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో సాజన్‌పై కేసు నమోదు చేయబడింది. అతను జైలు పాలయ్యాడు. ఈ కిడ్నీ రాకెట్ ను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.