యువతి ఆత్మహత్య.. 62 ఏళ్ల తాత లైంగిక వేధింపులు తాళ‌లేక‌..

Kerala girl ends life. 19 ఏళ్ల యువతి ఆత్మహత్యకు సంబంధించి 62 ఏళ్ల తాతను పోలీసులు అరెస్టు చేశారు.

By M.S.R  Published on  26 Dec 2022 3:38 PM IST
యువతి ఆత్మహత్య.. 62 ఏళ్ల తాత లైంగిక వేధింపులు తాళ‌లేక‌..

19 ఏళ్ల యువతి ఆత్మహత్యకు సంబంధించి 62 ఏళ్ల తాతను పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని కోజికోడ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. యువతి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ నోట్‌లో అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. బాలిక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా.. పలు పెద్ద విషయాలు వెలుగులోకి రావడంతో నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

కళాశాల విద్యార్థిని డిసెంబర్ 17న తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. ఆమె 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక మృతి తర్వాత నిందితుడు సూసైడ్ నోట్‌ను దాచిపెట్టాడని, ఆ తర్వాత దానిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. "అమ్మా.. మీ నాన్నను, మీకు ఇష్టమైన వ్యక్తిని అడగండి, అతను నాకు ఏమి చేసాడో, నేను అన్నింటిని భరించాను. ఇకపై నా వల్ల కాదు" అని సూసైడ్ నోట్ లో రాసింది. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరిచి అనంతరం పోలీసు కస్టడీకి తరలించారు.


Next Story