16 ఏళ్ల అమ్మాయి ప్రాణం తీసిన షవర్మా
Kerala girl dies of food poisoning after eating shawarma
By Medi Samrat Published on 2 May 2022 11:03 AM IST
కేరళ రాష్ట్రంలో షవర్మా తిన్న తర్వాత ఓ 16 సంవత్సరాల అమ్మాయి మరణించింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 16 ఏళ్ల బాలిక మరణించడమే కాకుండా18 మంది ఆదివారం నాడు ఆసుపత్రి పాలయ్యారు. కరివల్లూర్‌కు చెందిన దేవానంద కన్హంగాడ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మరణించినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం జ్యూస్ దుకాణంపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. 18 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై జిల్లా ఆసుపత్రిలో చేరారు. వారు కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు.
"ఫుడ్ పాయిజన్ అయిన వారిని చెరువుతూరు పిహెచ్‌సి, నీలేశ్వరం తాలూకా ఆసుపత్రులలో హాజరుకావాలని కోరాము. తేలికపాటి సమస్యలు ఉన్నవారికి అక్కడ చికిత్స చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. కండీషన్ సీరియస్ ఉన్నవారిని జిల్లా ఆసుపత్రికి తరలిస్తాము. ," అని జిల్లా వైద్యాధికారి, AV రాందాస్ మీడియాకు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి ఎంవీ గోవిందన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లలో నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రెస్టారెంట్లలో అందించే ఆహారం నాణ్యమైనదిగా ఉండేలా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. జ్యూస్ దుకాణం ట్యూషన్ సెంటర్ సమీపంలో ఉంది. ఎప్పటి లాగే పిల్లలు అక్కడికి వెళ్లి షవర్మా తిన్నారు.